Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎడిటర్ సుధాభాస్కర్, సీజీఎం ప్రభాకర్ సంతాపం
- జనరల్ మేనేజర్ రఘు, మార్కెటింగ్ మేనేజర్ ఉపేందర్ రెడ్డి నివాళి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నవతెలంగాణ దినపత్రిక సీనియర్ ఉద్యోగి బట్టు రెడ్యా నాయక్ ఆకస్మిక మరణానికి గురయ్యారు. ప్రజాశక్తి హైదరాబాద్ ఎడిషన్ను 1996లో ప్రారంభించిన సమయంలో సర్క్యులేషన్ డిపార్ట్మెంట్ మిషన్ సెక్షన్లో క్యాషియర్గాను, అకౌంటెంట్గాను ఆయన సేవలందించారు. క్రమశిక్షణతో ప్రతి ఒక్కరితో సఖ్యత కలిగి సంస్థ నియమాలకు కట్టుబడి పార్టీ సభ్యునిగా కొనసాగారు.గత కొంత కాలం నుంచి సానుభూతిపరుడిగా ఉంటున్నారు. ఆయన భార్య లీల, కూతురు మమత,కొడుకు హేమంత్ ఉన్నారు. గత 15 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి 8.30 గంటలకు తుది శ్వాస విడిచారు. హైదరాబాదులోని ఆయన నివాసం జవహర్ నగర్లో ఆయన భౌతిక కాయానికి పలువురు నివాళులులర్పించారు. అనంతరం బట్టు సొంత గ్రామం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బట్టు తండా గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. నవ తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ జనరల్ మేనేజర్ రఘు, మార్కెటింగ్ మేనేజర్ ఉపేందర్ రెడ్డి, ప్రొడక్షన్ ఇంఛార్జీ శ్రీనివాస్ రెడ్డి, మెయింటినెన్స్ ఇంచార్జ్ సుధీర్, శాఖ కార్యదర్శి నరసింగరావు, మిషన్ సెక్షన్ ఆపరేటర్లు వి.సత్యం, బి శేఖర్, పి నాగేష్, బి.నరేష్, బి.రాజేష్, పి.లక్ష్మణరావు, స్టోర్ ఇంఛార్జి, రవి, నాగరాజు, కె.విజరు భాస్కర్, కె.రాజన్న అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబాన్ని ఎల్లవేళలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. నవతెలంగాణ సంపాదకులు ఆర్.సుధాభాస్కర్, సీజీఎం పి.ప్రభాకర్ రెడ్యానాయక్ మరణం పట్ల సంతాపం తెలిపారు. బట్టు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని నవతెలంగాణ ప్రధాన కార్యాలయమైన ఎమ్హెచ్ భవన్లో రెడ్యానాయక్ సంతాప సభను నిర్వహించనున్నారు.