Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్యూషన్‌కు వచ్చే బాలునిపై లైంగికదాడి కేసులో..
నవతెలంగాణ- సిటీబ్యూరో
ట్యూషన్‌కు వచ్చిన బాలునిపై లైంగికదాడి చేసిన ఓ వృద్ధునికి 10 ఏండ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఎల్బీనగర్ కోర్టు తీర్పునిచ్చింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్ మంగళవారం వివరాలు వెల్లడించారు.
సరూర్‌నగర్‌లో రవీందర్ ప్రకాష్ నాయర్ అనే వృద్ధుడు పిల్లలకు ట్యూషన్ చెబుతూ ప్రయివేటు టీచర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఓ బాలుడు నాయర్ వద్ద ట్యూషన్‌కు వెళ్లేవాడు. అయితే, అతనిపై నాయక్ లైంగికదాడి చేసేవాడు. రోజురోజుకూ నాయర్ వేధింపులు అధికం కావడంతో బాలుడు విషయాన్ని ఇంట్లో చెప్పాడు. దాంతో బాలుని తల్లిదండ్రులు 2018 జూన్ 2న సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఇన్స్పెక్టర్ ఎన్సీహెచ్ రంగస్వామీ అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి కేసు విచారణ ఎల్బీనగర్ కోర్టులో కొనసాగింది. మంగళవారం నిందితునికి 10ఏండ్ల జైలు శిక్ష, రూ.45వేలు జరిమానా విధించారు.