Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ తార్నాకలోని తన నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. రాజీనామాకు సంబంధించి పూర్తి వివరాలతో సోనియా గాంధీకి లేఖ రాసినట్టు తెలిపారు. పార్టీలో హోంగార్డుగా ఉండలేక బయటకు వచ్చానన్నారు. త్వరలోనే బీజేపీలో చేరనున్నట్టు స్పష్టం చేశారు. టీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, అందుకే రాజీనామా చేశానన్నారు. కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితిని ఎప్పుడూ ఊహించలేదని, ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనూ విఫలమైందన్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటికి నుంచి అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోతూ వచ్చామని, అయినా ఆయనను ఆరేండ్ల పాటు కొనసాగించారన్నారు. సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీలోకి ఇటీవల వచ్చిన రేవంత్‌రెడ్డిని టీపీసీసీ అధ్యక్షునిగా నియమించారని ఆవేదన వ్యక్తం చేశారు.