Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బహుజన్ సమాజ్ పార్టీలో మహిళలకు అత్యంత గౌరవం ఇస్తున్నదనీ, టీఆర్ఎసలో వారికి అలాంటి గౌరవం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఎన్నికల్లో మహిళా కార్యకర్తలు గొప్పగా పనిచేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మహిళా నాయకత్వాన్ని నిర్మించాలని సూచించారు. మహిళలకు సంపూర్ణ అధికారాలు ఇచ్చే ఏకైక పార్టీ బీఎస్పీ అని తెలిపారు.సావిత్రిభాయి ఫూలే,రమాబాయి అంబేడ్కర్,మాయావతి వంటి మహనీయుల బాటలో నడిచి బహుజన రాజ్యం సాధించాలన్నారు.