Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతికి అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, క్రీడా, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియల్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు మంగళవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. విధి నిర్వహణలో ఉన్న అటవీ అధికారిని గుత్తికోయలు దాడి చేసి చంపడం దారుణమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను ఖండిస్తున్నామని తెలిపారు. శ్రీనివాస్‌రావు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని పీసీసీఎఫ్ హామీనిచ్చారు. విధి నిర్వహణలో ఉన్న శ్రీనివాసరావును గొత్తికోయలు కొట్టిచంపడంపై తెలంగాణ చాప్టర్ ఐఎఫ్ఎస్ అసోసియేషన్, తెలంగాణ ఫారెస్టు అఫీసర్స్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. క్షేత్రస్థాయి సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలనీ, అటవీశాఖను పటిష్టంగా తయారు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరాయి. గతేడాది ఉత్తమ అధికారిగా గోల్డ్‌మెడల్ అందుకున్న విషయాన్ని గుర్తుకు చేశాయి.