Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలకు కరదీపిక : మంత్రి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ - కల్చరల్
అన్ని రంగాల ప్రజలకు తెలంగాణపై అవగాహన కలిగించే 'తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర' కర దీపిక అని పర్యాటక సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీనివాస్ ౌడ్ అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలోని మంత్రి కార్యాలయంలో మంగళవారం సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్తో కలసి మంత్రి 'తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర' గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 715 పేజీలతో అకాడమీ విశేష కృషి చేసి ఈ గ్రంథాన్ని అందుబాటులోకి తెచ్చిందని అభినందించారు. గొప్ప పరిశోధనాత్మక గ్రంథమని, ప్రతి ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. జూలూరి గౌరీ శంకర్ మాట్లాడుతూ.. ఈ గ్రంథంలో 50 మంది ప్రముఖ రచయితలు, తెలంగాణ పూర్వ పాలకుల నుంచి మలి దశ తెలంగాణ ఉద్యమం వరకూ గ్రంథంలో నిక్షిప్తం చేశారని తెలిపారు. గత పాలకులు తెలంగాణ సాహిత్యాన్ని, కవులను నిర్లక్ష్యం చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ మామిడి హరికృష్ణ, అధికారుల సంఘం నాయకులు మామిళ్ల చంద్రశేఖర్, కవి కోట్ల వెంకటేశ్వర రెడ్డి, విమర్శకుడు కెపి.అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.