Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాటర్ ట్యాంక్ ఎక్కి వర్కర్ల ఆందోళన
నవతెలంగాణ-కొత్తగూడ
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్టల్లో పనిచేస్తున్న కాంటిజెన్సీ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. దాంతో మండలకేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వాటర్ ట్యాంక్ ఎక్కిన హాస్టల్ వర్కర్స్‌ను కిందికి దింపే ప్రయత్నం చేశారు. సుమారు రెండు గంటలపాటు నిరసన తెలిపిన వర్కర్లు పోలీసుల సూచనలతో నిరసన విరమించారు. ఈ సందర్బంగా డైలీ వర్కర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు సౌందర్య మాట్లాడుతూ.. తమను పర్మి నెంట్ ఉద్యోగులుగా గుర్తించే వరకు దశల వారీ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కొంతమంది అధికారులు ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తూ తమ సమస్యలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి డైలీ వైజ్ వర్కర్లకు బేషరతుగా ఉద్యోగ భద్రత కల్పిస్తూ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడ, గూడూరు, గంగారం మండలాల డైలీ వైజ్ వర్కర్లు పాల్గొన్నారు.