Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహాత్మా జోతిరావు ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా (ఇన్ చార్జి) ఆర్సీవో, నాగర్ కర్నూల్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరెడ్డిపై గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌రెడ్డి దౌర్జన్యం చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) రాష్ట్ర స్టీరింగ్ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు స్టీరింగ్ కమిటీ సభ్యులు కె జంగయ్య, చావ రవి, వై అశోక్ కుమార్, ఎం రవీందర్, ఎం సోమయ్య, టి లింగారెడ్డి, యు పోచయ్య, డి సైదులు, షౌకత్ అలీ, రాజయ్య, జాడి రాజన్న, మేడి చరణ్ దాస్, కొమ్ము రమేష్, ఎన్ యాదగిరి, ఎస్ హరికృష్ణ, వి శ్రీను నాయక్, జాదవ్ వెంకట్రావు, డి రాజనర్సుబాబు, వై విజయకుమార్, టి విజయసాగర్, శాగ కైలాసం సంయుక్తంగా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విధినిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారిపై దౌర్జన్యం చేసి, దుర్భాషలాడిన ఆ ఎమ్మెల్యేపై కేసునమోదు చేసి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎంజేపీ టీఎస్‌యూటీఎఫ్ ఖండన
వెంకటరెడ్డిపై గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌రెడ్డి దౌర్జన్యం చేయడాన్ని టీఎస్‌యూటీఎఫ్ ఎంజేపీ గురుకుల ఉపాధ్యాయుల విభాగం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఎంజేపీ టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర సబ్ కమిటీ కన్వీనర్ ఎస్ సృజన, కో-కన్వీనర్ టి లివిన్స్టన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విధినిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారిపై చొక్కా పట్టుకుని భౌతిక దాడికి దిగటంతోపాటు రాయలేని భాషలో దుర్భాషలాడిన ఆ ఎమ్మెల్యేపై కేసునమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.