Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శ్రీచైతన్య స్కూల్ ఈస్ట్‌మారెడ్‌పల్లి బ్రాంచి (మెహిదీపట్నం జోన్) నుంచి గొంగడి త్రిష జాతీయ స్థాయిలో అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికైంది. ఈనెల 27న ప్రారంభమయ్యే సిరీస్‌లో ఆమె ఆడనుంది. త్రిష ఆ బ్రాంచ్‌లో ఆరు నుంచి పదో తరగతి వరకు చదివారు. యాజమాన్యం సహాయంతో ప్రతిరోజూ ప్రాక్టీస్‌కు అనుమతి తీసుకుని పట్టుదలతో అటు క్రికెట్‌ను, ఇటు చదువును కొనసాగించారు. పదో తరగతిలో 10కి పది జీపీఏ సాధించారు. ఆమె ఎనిమిదేండ్ల వయస్సులోనే జిల్లాస్థాయి అండర్-16 జట్టులో ఆడారు. ఆపైన 12 ఏండ్ల వయస్సులో అండర్-19 తెలంగాణ జట్లుకు ఎంపికయ్యారు. కళాశాల చదువును కొనసాగిస్తూనే బీసీసీఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. త్రిష ప్రధానంగా లెగ్ స్పిన్నర్‌గానే కాకుండా బ్యాటింగ్‌లోనూ తన ప్రతిభను కనబరిచి ఆల్‌రౌండర్‌గా నిలిచారు. ఈ సందర్భంగా త్రిషకు శ్రీచైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ మంగళవారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. శ్రీచైతన్య స్కూల్ టెక్నో కరిక్యులమ్‌లో విద్యార్థులు చదువుతోపాటు అనేక ఇతర అంశాలపైనా అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తారని పేర్కొన్నారు. దానికి త్రిష ఒక ఉదాహరణ తెలిపారు.