Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బుద్ధిజం పూర్వ వైభవం కోసం కృషి చేస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో భూటాన్ నుంచి అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్యకు చెందిన భూటాన్ కేంద్ర మంత్రి కార్యదర్శి ఉగ్వేన్ నామ్ గ్వేల్ నేతృత్వ ంలో 24 మంది ప్రతినిధులు మంత్రి తో సమావేశమయ్యారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆచార్య నాగార్జునుడు నడియాడిన ప్రదేశం నాగార్జునసాగర్‌లో బుద్ధవనం ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించినట్టు తెలిపారు. ఆ ప్రాజెక్టులో బౌద్ధ ఆరామాల నిర్మాణం తెలుసుకు నేందుకు ఇప్పటికే తైవాన్, ఇండోనేషి యా, మంగోలియా, బెంగుళూరుకు చెందిన మహాబోధి సొసైటీకి చెందిన బౌద్ధ సంస్థలు సంప్రదించాయని చెప్పారు. సమావేశంలో భూటాన్ చెంది న బౌద్ధ అంతర్జాతీయ సమాఖ్య, రాష్ట్ర పర్యాటక శాఖ సంయుక్తాధ్వర్యంలో ఆచార్య నాగార్జునిడిపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించే అంశంపై చర్చించారు. సమావేశంలో రాష్ట్ర బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యే కాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, పర్యాటక శాఖ ఎండీ మనోహర్, సుద్దాల సుధాకర్ తేజ, టూరిజం, బుద్ధవనం ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.