Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు సమస్యను తక్షణమే పరిష్కరించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రబోడు గ్రామంలో గుత్తికోయలు, అటవీశాఖ అధికారులకు మధ్య జరిగిన దాడుల్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్వో) చలమల శ్రీనివాసరావు హత్యకు గురయ్యారనీ, ఆయన మరణం బాధాకరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఆయన మరణం పట్ల బుధవారం ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీర్ఘకాలంగా పోడు సమస్యను పెండింగ్‌లో ఉంచడంతో సమస్య జఠిలమై ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో గిరిజనులపై అటవీశాఖ సిబ్బంది దాడులు నిత్య కృత్యమయ్యాయని పేర్కొన్నారు. అనేకమంది గిరిజన రైతుల ఆత్మహత్యలతోపాటు, అటవీశాఖ అధికారులపైనా దాడులు పెరుగుతున్నా యని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలనీ, పోడు సమస్యను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
సీపీఐ ఖండన
ఎఫ్ఆర్వో చలమల శ్రీనివాస్‌రావును హతమార్చడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రంగా ఖండించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.