Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లా కమిషన్ చైర్మెన్‌కు వినోద్‌కుమార్ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాజ్యాంగంలోని ఆర్టికల్ 200ను సవరణలు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. 'ఆజ్ సూన్ ఆజ్ పాసిబుల్' అనే పదాన్ని మార్చేసి ''విత్ ఇన్ 30 డేస్'గా సవరణ చేయాలని కోరారు. ఈ మేరకు లా కమిషన్ చైర్మెన్ తిరురాజ్ ఆవస్తికి బుధవారం ఆయన లేఖ రాశారు. అసెంబ్లీ, శాసనమండలి ఆమో దించిన బిల్లులను ఆయా రాష్ట్రాల గవ ర్నర్లు నిర్ణీత గడువులోగా ఆమోదించేలా చేయాలని సూచించారు.