Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని రాజ్యాంగ వ్యవస్థలు అధికారంలో ఉన్న పార్టీలకు కీలు బొమ్మలుగా మారాయని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు జి నిరంజన్ విమర్శించారు. ఆయా సంస్థలు ఎత్తుకుపై ఎత్తులు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయని చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. శాసన, కార్య నిర్వాహక వ్యవస్థ ఘోరంగా విపలమవుతున్న తరుణంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని ఈ అరాచక పోకడలను అరికట్టాలని కోరారు.
క్యాన్సర్ తల్లిని ఎలా వదిలారు: మర్రికి మల్లు రవి ప్రశ్న
క్యాన్సర్ సోకి... కష్టకాలంలో ఉన్న తల్లిలాంటి పార్టీని ఎలా వదిలారని మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డిని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ప్రశ్నించారు. ఎనిమిదేండ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటి వరకు ఎందుకు తెలంగాణ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఐఐఎం, ఐటీఐఆర్ ఇవన్నీ రాలేదని మీకు తెలియదా? అని మర్రిని ప్రశ్నించారు. మీరు బీజేపీలో చేరడం వల్ల ఈ ఎనిమిదేండ్లలో జరగనిది ఇప్పుడు జరుగుతుందా?అని నిలదీశారు.