Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ కళ్యాణ మండపంలో బహిరంగసభ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ ఒకటిన ర్యాలీనీ, బహిరంగసభను నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ ఒకటిన ఉదయం తొమ్మిది గంటలకు బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్కు నుంచి ఆర్టీసి కళ్యాణ మండపం వరకుర్యాలీ ఉంటుందనీ, అనంతరం 10 గంటలకు బహిరంగసభను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు, వివిధ శాఖల అధికారులు, ఉన్నతాధికారులు పాల్గొంటారని వెల్లడించారు.