Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీ ఎన్నిసార్లు ఆట మొదలెడతారు?
- విషం చిమ్మడం తప్ప బీజేపీ జాతీయ కార్యవర్గంలో చర్చిందేం లేదు :
ఐటీ దాడులపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫైర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
మునుగోడు ఓటమి తర్వాత కేంద్రప్రభుత్వం రాష్ట్రంపై కక్ష కట్టిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. హైదరాబాద్ వచ్చిన మోడీ 'ఆట మొదలైంది' అన్నారనీ, ఎన్నిసార్లు ఇలాంటి ఆటలు మొదలు పెడతారని ఎద్దేవా చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలంగాణకు ఉపయోగపడే ఏ ఒక్క అంశం చర్చించలేదన్నారు. కేంద్రం నుంచి రావల్సిన నిధులపై రాష్ట్ర బీజేపీ నాయకులు ఏం ప్రెజెంటేషన్ ఇచ్చారని ప్రశ్నించారు. కేవలం రాజకీయంగా విషం చిమ్మడం తప్ప, ఆ కార్యవర్గ సమావేశాల్లో సాధించిందేం లేదన్నారు. బుధవారంనాడిక్కడి టీఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం రాష్ట్రంపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులను ఉసిగొల్పి, ఆట మొదలైందని సంబర పడుతున్నదనీ, ఇలాంటి చిల్లర చేష్టలకు టీఆర్ఎస్పార్టీ భయపడబోదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ అడ్డంగా దొరికిపోయిందనీ, ఆర్ఎస్ఎస్లో ఉన్నంతమాత్రాన తప్పులు ఒప్పులు ఎలా అవుతాయని ప్రశ్నించారు. న్యాయం, చట్టంపై బీజేపీకి విశ్వాసం లేదని చెప్పడానికి సిట్ విచారణకు బీఎల్ సంతోష్ గైర్హాజరు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు.