Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఖమ్మం జిల్లాలో జరిగిన ఎఫ్ఆర్ఓ అధికారి హత్యకు పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అధికారులపై దాడులు జరుగుతున్నాయన్నారు. 2014 నుంచి పోడు భూములకు పట్టాలిస్తామని మాట ఇచ్చి మోసం చేస్తున్నారనీ, తాజాగా మళ్లీ సర్వే పేరుతో ఆదివాసీలను మోసం చేస్తున్నారన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాజ్యాధికార సంకల్ప దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తన 55వ పుట్టిన రోజు సందర్భంగా 55మందిని పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలు దర్యాప్తు సంస్థల పేరుతో డ్రామాలు చేస్తున్నాయనీ, ప్రజలు ఈ పార్టీలను నమ్మొద్దని చెప్పారు. ఇవన్నీ కుమ్మక్కు రాజకీయాలు అని విమర్శించారు.