Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ), యూనిసెఫ్ ఇండియా సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ ముగింపు కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్, సాంఘిక సంక్షేమ కళాశాలలకు చెందిన విద్యార్థులు 10 నూతన ఆవిష్కరణలను ప్రదర్శించారు. టీఎస్ఐసీ, యూనిసెఫ్ ఇండియాతో పాటు ఇన్క్వీ-ల్యాబ్ ఫౌండేషన్, వై-హబ్, యువ ఆధ్వర్యంలో యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ కార్యక్రమంలో 490 ఇంజినీరింగ్, ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీలకు చెందిన 11,823 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో నుంచి 10 బృందాలకు చెందిన ఆవిష్కరణలు ముగింపు ప్రదర్శనలో బాగస్వామ్యమయ్యాయి. 824 ప్రతిపాదనలు రాగా వాటి నుంచి ఈ పదింటిని ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ఐసీ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శాంత తౌతమ్, యూనిసెఫ్ ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మురళికృష్ణ, బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ వైన్ ఓవెన్, ఇంక్వీ ల్యాబ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వివేక్, యువ ప్రతినిధి రవితేజ పాల్గొన్నారు.
విజేతలు వీరే...
వరంగల్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ మొదటి బహుమతిని, హైదరాబాద్ బీవీఆర్ఐటీ మహిళా ఇంజినీరింగ్ కాలేజ్ ద్వితీయ బహుమతిని, వరంగల్ ఈస్ట్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ తృతీయ బహుమతిని గెలుచుకుంది. సెయింట్ ఆన్స్ మహిళా కళాశాల ప్రత్యేక ప్రశంసనందుకుంది.