Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్‌యూపీపీటీఎస్ నేతలకు మంత్రి హరీశ్‌రావు హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని భాషాపండితులకు త్వరలోనే పదోన్నతులు కల్పిస్తామంటూ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం హైద రాబాద్‌లో మంత్రిని ఆర్యూ పీపీటీఎస్ అధ్యక్షులు సి జగదీశ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కె ఇస్రాయెల్ నేతృత్వంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో దశా బ్ధాలుగా భాషా పండితులు ఎదురు చూస్తున్న గ్రేడ్-2 పోస్టుల అప్‌గ్రెడేషన్ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనీ, అందులో భాగంగానే సర్వీసు రూల్స్ 2,3 ఇచ్చి, ఆ తర్వాత 110 జీవోను ఇచ్చిందంటూ హరీశ్‌రావు వ్యాఖ్యానించారని తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామంటూ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారని తెలిపారు.