Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సేవలు విస్తరిస్తున్నాం...
- క్విజ్‌లో పాల్గొని బహుమతులు గెలుచుకోండి : టెలికం సీజీఎమ్ కేవీఎన్ రావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బీఎస్ఎన్ఎల్ సేవల్ని వినియోగించుకొని ప్రభుత్వరంగ సంస్థను ఆదరించాలని టెలికం చీఫ్ జనరల్ మేనేజర్ కేవీఎన్ రావు విజ్ఞప్తి చేశారు. ఆబిడ్స్‌లోని టెలికం కార్యాలయంలో జరిగిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సర్కిల్ పరిధిలో బీఎస్ఎన్ఎల్ అత్యంత బలమైన నెట్వర్క్ కలిగి ఉన్నదనీ, 4జీ సేవల కోసం దాన్ని మరింత పటిష్టం చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్త ంగా 76 ఆధార్ ఎన్రోల్మెంట్ సేవల్ని అందిస్తు న్నామన్నారు. 6 నెలలు, ఏడాది ప్లాన్లలో వినియోగ దారులకు ఉచితంగా ఫైబర్ కనెక్షన్‌తో పాటు వైఫై మోడెం కూడా ఇస్తున్నామని తెలిపారు. ఇన్‌యాక్టివ్ గా ఉన్న కష్టమర్లను యాక్టివ్ చేసేందుకు బీఎస్ఎన్ ఎల్ 25 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తున్నదని చెప్పా రు. రాష్ట్రంలో 695 టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్లు (టిప్), 74 ఫ్రాంచైజ్‌లు, 20 ఇంటిగ్రేటర్స్, 550 మంది డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లు, 11వేల మంది రిటై లర్స్ ఉన్నారని వివరించారు. 4జీ సేవల విస్తరణ కోసం 4,100 మోబైల్ టవర్లు, రూ.60 కోట్ల వ్యయ ంతో 1,363 కి.మీ., ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు, మరో 390 గ్రామాలకు 4జీ సేవల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వినియోగదారుల ను ఆకర్షించేందుకు పలు స్కీంలు కూడా ప్రవేశపెడు తున్నామని తెలిపారు. బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ సంస్థ సహకారం తో గత ఏడాది డిసెంబర్ 13 నుంచి వినియోగదా రులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. రూ. 186, రూ.666 ఓచర్లతో రీచార్జి చేసుకున్న విని యోగదారులు ఈ క్విజ్ పోటీలో పాల్గొనవచ్చని తెలి పారు. ప్రతి వారం లక్కీ డ్రా తీసి రెండు స్మార్ట్ మోబైల్ఫోన్లు, ప్రతి నెలా తీసే డ్రాలే ఒక ఐప్యాడ్, ఆరు నెలలకోసారి తీసే డ్రాలో గ్రాండ్ ప్రైజ్‌గా మారుతి స్విఫ్ట్ కారును వినియోగదారులకు అంది స్తున్నామని తెలిపారు. ఈ స్కీం నిరంతరం కొనసా గుతుందన్నారు. ఇటీవల తీసిన గ్రాండ్ ప్రైజ్ డ్రాలో మల్కాజ్‌గిరికి చెందిన ప్రదీప్ కుమార్ మారుతి స్విఫ్ట్ కారును గెలుచు కున్నారని చెప్పారు. ఇదే కార్యక్రమం లో విజేతకు కారు తాళాలు అంద చేశారు. ఈ సంద ర్భంగా విజేత ప్రదీప్‌కుమార్ మాట్లాడుతూ బీఎస్ ఎన్ఎల్ సేవల్ని వినియోగించకుండా, పుకార్లను నమ్మొద్దని అన్నారు. తాను సంస్థ నుంచి మెరుగైన సేవలు పొందుతున్నట్టు చెప్పారు. కార్య క్రమంలో టెలికం తెలంగాణ సర్కిల్ పీజీఎమ్ (హెచ్ఆర్) శాస్త్రి, జనరల్ మేనేజర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.