Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో క్రీడా రంగాన్ని పటిష్టం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ అకాడమిని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. డిసెంబర్ ఒకటి నుంచి వాలీబాల్ అకాడమి కోసం క్రీడాకారుల ఎంపిక కొనసాగుతున్నదనీ, అర్హులైన క్రీడాకారులు హాజరు కావాలని పేర్కొన్నారు. 14 నుంచి 18 ఏండ్ల వయసులోపు బాల బాలికలు మెరుగైన ఆధారంగా క్రీడాకారులను అధికారులు ఎంపిక చేస్తారని వెల్లడించారు. క్రీడాకారులను తయారు చేసేందుకు అధికారులు నిరంతరం కృషి చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ సహకారంతో బాక్సర్ నిఖత్ జరీన్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ... దేశంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు ఎంపికయ్యారని తెలిపారు.