Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇవా-ఐవీఎఫ్ సెంటర్ ఎండీ డాక్టర్ మోహన్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యశోద సినిమాపై తమ న్యాయపోరాటం కొనసాగుతుందని ఇవా-ఐవీఎఫ్ ఎండీ డాక్టర్ మోహన్ రావు స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఆ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఐశ్వర్య నుపూర్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ సినిమాలో సంతాన సాఫల్య కేంద్రానికి సంబంధించి ఆస్పత్రి పేరు ఇవాగా ఉండటం తమ బ్రాండ్ ఇమేజ్‌కు నష్టం కలిగించిందని చెప్పారు. ఇప్పటికే నష్ట నివారణ కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆ సినిమా నిర్మాత, దర్శకులు, హీరోయిన్ సమంతతో తమకు పరిచయం లేదనీ, వైరం లేదనీ, అయితే మరింత నష్టం జరగకుండా ఉండేందుకే ప్రయత్నిస్తున్నామని చెప్పారు.