Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదగిరి గుట్టలో మూడు రోజులపాటు నిర్వహణ
- జయప్రదానికి ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) రాష్ట్ర మహాసభలు యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి గుట్టలో ఆదివారం ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు కొనసాగే ఈ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ కార్మికవర్గానికి పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మహాసభల సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు యాదగిరి గుట్టలో పది వేల మందితో మహా ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్తోపాటు పలువురు రాష్ట్ర నేతలు పాల్గొంటారని చెప్పారు. 28న ప్రతినిధుల సభ ప్రారంభమవు తుందని వివరించారు. ఆ తర్వాత కార్యదర్శి నివేదికపై చర్చలు కొన సాగుతాయని వెల్లడించారు. మహా సభల్లో కార్మికులకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలపై మొత్తం 40 తీర్మానాలను ప్రవేశపెడ తామని చెప్పారు. విలేకర్ల సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాలరాజ్, కార్య నిర్వాహక అధ్యక్షులు ఎమ్డీ యూసుఫ్, నాయకులు పి.ప్రేం పావని తదితరులు పాల్గొన్నారు.