Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 ఇంజినీరింగ్ కాలేజీలకు జరిమానా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాల తీరుపై తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులరేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి అయితే 26 కాలేజీలపై ఫిర్యాదులు అందాయని తెలిపింది. దీనిపై విచారించిన కమిటీ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా అధికంగా ఫీజులు వసూలు చేసిన 15 నుంచి 20 ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలకు జరిమానా విధించింది. ఆయా కాలేజీలకు రూ.రెండు లక్షల చొప్పున జరిమానా విధించినట్టు సమాచారం. అయితే ప్రముఖ కాలేజీలే అందులో ఉన్నట్టు తెలిసింది. అయితే కొన్ని కాలేజీ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.