Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పాఠశాల నిర్వహణ గ్రాంట్‌ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో విద్యాసంవత్సరం ప్రారంభమై ఆర్నెల్లు గడిచినా పాఠశాల నిర్వహణ గ్రాంటును విడుదల చేయలేదని విమర్శించారు. గతేడాది గ్రాంటును విద్యాసంవత్సరం ముగిసే సమయంలో విడుదల చేసి వేసవి సెలవుల్లో ఖాతాలను విద్యాశాఖ అధికారులు రద్దు చేశారని తెలిపారు. ఖాతాల్లో నిల్వ ఉన్న గ్రాంటును వెనక్కి తీసుకున్నారని పేర్కొన్నారు. సమగ్ర శిక్ష పీఏబీ ఆమోదం మేరకు విద్యాశాఖకు బడ్జెట్ విడుదలై రెండు నెలలు గడుస్తున్నా పాఠశాలల నిర్వహణ గ్రాంటు విడుదల చేయలేదని వివరిం చారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులే ప్రతి అవసరానికీ వారి చేతి నుంచి ఖర్చు చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బోధనాభ్యసన సామా గ్రి కొనుగోలు, లైబ్రరీ, ల్యాబోరేటరీ తదితర అవసరాలకూ నిధుల కొరత ఇబ్బందికరంగా ఉంటున్నదని తెలిపారు. అందుకే పాఠశాల నిర్వహణ గ్రాంటును తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.