Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీలక పత్రాలు స్వాధీనం
- కమిషనర్, మేనేజర్ రిమాండ్
నవతెలంగాణ- జహీరాబాద్
లంచం తీసుకుంటూ పట్టుబడిన జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్, మేనేజర్, అటెండర్‌ను ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మూసానగర్ కాలనీకి చెందిన మహ్మద్ నిసార్ ఇంటి మ్యుటేషన్ చేసేందుకు రూ.రెండు లక్షల లంచం తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్ సుభాష్‌రావు, మేనేజర్ మనోహర్ పట్టుబడిన విషయం విదితమే. వారిద్దరితోపాటు అటెండర్ రాకేష్‌ను ఏసీబీ అధికారులు 24 గంటలపాటు విచారించారు. రెండో రోజూ మున్సిపాల్టీ కార్యాలయంలో సోదాలు చేశారు. అనుమానాస్పద దస్త్రాలను సీజ్ చేశారు. గురువారం ముగ్గురు నిందితులను ఏసీబీ కోర్టులో హాజరు పరిచినట్టు ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు. రిమాండ్‌కు తరలించారు.