Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం : బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు
డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ జనగణన చేపట్టి, జనాభా దామాషా ప్రకారం వారికి 50శాతం రిజర్వే షన్లను అమలు చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎసీ,్టబీసీ, మైనారిటీ రిజర్వేషన్లను కూడా పెరిగిన జనాభాకనుగుణంగా పెంచాలన్నారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహా ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాలు, విద్యార్థి, కుల సంఘాల నాయకులు, మేధావులు, ప్రొఫెసర్లు తమ వెంట నడవాలని పిలుపునిచ్చారు. 1932 తర్వాత ఇప్పటివరకు బీసీ కులగణన ఎందుకు చేయలేదో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. బీసీ కులగణన చేయాలనీ, దేశంలోని ఉన్నత న్యాయస్థానాల్లో కూడా ఎస్సీ,ఎస్టీ, బీసీి, మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ క్రీమీలేయర్ విధానం ఎత్తివేయాలన్నారు. ఈడబ్యుఎస్ రిజర్వేషన్లలో ఎస్సీ,ఎస్టీ, బీసీలకు వాటా కల్పించాలని కోరారు. దేశవ్యాప్తంగా కేంద్ర విశ్వవిద్యాలయాల్లో బీసీల కోసం 8,617 టీచింగ్ పోస్టుల భర్తీకి అనుమతి ఉన్నా..ఉద్దేశపూర్వకంగా 4,821 పోస్టులను ఖాళీగా ఉంచారని తెలిపారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకీ బీసీల పట్ల చిత్తశుద్ది లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దయానందరావు, రాష్ట్ర మైనారిటీ కన్వీనర్ అబ్రార్, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ ముదిరాజ్, పార్టీ అధికార ప్రతినిధులు సాంబశివ గౌడ్, అరుణ క్వీన్, డా.వెంకటేష్ చౌహాన్ పాల్గొన్నారు.