Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-కంఠేశ్వర్
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పటిష్టం చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ద్వితీయ మహాసభను గురువారం జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మెడికల్ రియింబర్స్‌మెంట్ కోతలతో నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ పెన్షనర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కనీస పెన్షన్ రూ.9వేలు ఇచ్చేందుకు కనికరం చూపించటం లేదని అన్నారు. కార్పొరేట్లకు, పారిశ్రామికవేత్తలకు మాత్రం కోట్లాది రూపాయలు బ్యాంకు రుణాలను మాఫీ చేయడానికి చేతులు వస్తున్నాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లోని రిటైర్మెంట్ ఉద్యోగులు సామాజిక పింఛన్‌కన్నా తక్కువ పెన్షన్‌తో బతుకుతున్నారని చెప్పారు. జిల్లా పరిషత్ చైర్మెన్ దాదన్నగారి విట్టల్‌రావు మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ ప్రయాణాల్లో రాయితీ కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వేలో గతంలో ఉన్న రాయితీని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ట్రెజరీ అధికారి బి.కోటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబం ధించి ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఆల్ పెన్షనర్స్ రాష్ట్ర అధ్యక్షులు పాలకుర్తి కృష్ణమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచ్చ రంగయ్య మాట్లాడుతూ.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌లో పాత పింఛన్ విధానం అమలుకు పూనుకున్నాయని, తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈపీఎస్ పెన్షనర్ల హక్కుల సాధన కోసం ఢిల్లీలో డిసెంబర్ 7, 8 తేదీల్లో ధర్నాకు పిలుపునిచ్చినట్టు తెలిపారు. అనం తరం గుర్రాల సరోజనమ్మను ఘనంగా సన్మానిం చారు. దత్తాద్రిరావు అధ్యక్షత వహించిన ఈ మహా సభలో కె.రామ్మోహన్రావు, ముత్తారం నరసింహ స్వామి, ఎస్.ప్రసాద్‌రావు, సుదర్శన్రాజ్, శిర్ప హను మాన్లు, భోజరావు, అందే సాయిలు పాల్గొన్నారు.