Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గజ్వేల్ న్యాయవాదులకు మంత్రి హరీశ్‌రావు హామీ
నవతెలంగాణ-గజ్వేల్
గజ్వేల్ పట్టణంలో న్యాయవాదులు కోరినట్టు సబ్ కోర్టు ఏర్పాటు చేసి అందులో అన్ని హంగులను సమకూర్చుతామని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం తెలంగాణ ఫారెస్ట్ చైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ శ్రీనివాస్‌తో కలిసి న్యాయవాదులు మంత్రి హరీశ్‌రావును హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గజ్వేల్‌లో సబ్ కోర్టుకు ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వాలని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్ ద్వారా వివరించారు. ఆదిలాబాద్‌లో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఒకటి, రెండు రోజుల్లో గజ్వేల్ సబ్ కోర్టు సంబంధించిన ఉత్తర్వులు ఇస్తారని హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, న్యాయపరంగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పార్థసారథి రాజు, కాళీ ప్రసాద్, అశోక్ రెడ్డి, వనం భాస్కర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్‌ను జిల్లా చేయండి
గజ్వేల్‌ను జిల్లాగా ఏర్పాటు చేస్తే న్యాయస్థానంతో పాటు అన్ని కార్యాలయాలు సమకూరుతాయని గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పార్థసారథిరాజు అన్నారు. మంత్రి హరీశ్‌రావును కలిసే ముందు ఎఫ్డీసీ చైర్మెన్ వంటేరు ప్రతాపరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ మాదాసు శ్రీనివాస్‌తో ఆయన చర్చించారు. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకుపోవాలని కోరారు. జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రభుత్వ కార్యాలయాన్నీ తరలి వస్తాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దీనికోసం కృషి చేయాలని కోరారు.