Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంయుక్త కిసాన్ మోర్చా ఆదివాసీ అడవి హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ
- 26న చలో రాజ్‌భవన్
నవతెలంగాణ- అడిక్‌మెట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలని సంయుక్త కిసాన్ మోర్చా, ఆదివాసీ అడవి హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని విద్యానగర్ మార్క్స్ భవన్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆదివాసీ, రైతు సంఘాల నాయకులు వేములపల్లి వెంకటరామయ్య, సాగర్, పశ్య పద్మ మాట్లాడారు. మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసపూరిత వైఖరి అవలంబిస్తుందన్నారు. మూడు కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను విరమింపజేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సంవత్సరానిక ిపైగా చారిత్రాత్మక ఉద్యమం చేసి మహత్తర విజయాన్ని సాధించా మన్నారు. విద్యుత్ సవరణ బిల్లును ఉప సంహరించు కుంటామని, ఉద్యమ నాయకులపై కేసులు ఎత్తివేయడంతోపాటు ఉద్యమం సమయంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం తదితర డిమాండ్లు పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ద్రోహానికి పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక చర్యల వల్ల ఏటా 15 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. రైతుల ఆత్మహత్యలను నివారిం చాలని, ఏకకాలంలో రుణమాఫీ చేసి రుణ విమోచన చట్టం తీసుకు రావాలని డిమాండ్ చేశారు. రైతులకు, వ్యవసాయ కూలీలకు రూ. 5వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. అలాగే, గిరిజనులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములపై కనీస హక్కులను కాలరాస్తున్న అడవి సంరక్షణ చట్టం 2022ను వెంటనే ఉపసంహరిం చుకోవాలని డిమాండ్ చేశారు. అడవి సంరక్షణ నియమాలు ఉపసంహరణ కోసం ఈనెల 26న చలో రాజభవన్‌కు పిలుపు నిచ్చారు. సమావేశంలో రైతు, ఆదివాసీ సంఘాల నాయకులు కెచ్చల రంగయ్య, అంజయ్య నాయక్, రాయల చంద్రశేఖర్, శ్రీరామ్ నాయక్, మండల వెంకన్న, ప్రసాద్ అన్న, వస్కుల మట్టయ్య, బి.గోపాల్, బాలమల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.