Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
హైదరాబాద్‌లోని హిమా యత్నగర్లో గల పంచాయతీ రాజ్ కమిషనరేట్‌ను తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 300 మంది కార్మికులు గురువారం ధర్నా చేశారు. సకాలంలో వేతనాలు ఇవ్వాలనీ, 30 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేయడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మూడు గంటల పాటు అక్కడే బైటాయించారు. అక్కడ తొలగింపులను ఆపేయాలని నినదించారు. పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రామారావు ధర్నా వద్దకు వచ్చి కార్మికుల డిమాండ్లను విన్నారు. సకాలంలో జీతాలు వచ్చేలా చూస్తామని హామీనిచ్చారు. అక్రమంగా ఎవరినైనా తొలగిస్తే తమ దృష్టికి తేవాలని సూచించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరిన్ని పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మధుసూధన్‌రెడ్డి, పి.అరుణ్‌కుమార్, రాష్ట్ర నాయకులు కొత్తపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.