Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీహార్లో డీఎస్ఎంఎం జాతీయ మహాసభలు
- కరపత్రాల ఆవిష్కరణలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యాంగ రక్షణ, రిజర్వేషన్ల అమలు ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ నినాదాలే ప్రాతిపదికగా బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయి పట్టణంలో దళిత శోషన్ ముక్తి మంచ్ (డీఎస్ఎంఎం) జాతీయ మూడో మహాసభలు జరుగనున్నాయని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు తెలిపారు. గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద సంఘం రాష్ట్ర నాయకులతో కలిసి సంబంధిత కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. కేవీపీఎస్ సహాయ కార్యదర్శి కోట గోపి అధ్యక్షతన రాష్ట్ర సమావేశాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో దళితులపై 300 రెట్లు దాడులు పెరిగాయని తెలిపారు.ఆ పార్టీ రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కుట్రలు చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ వల్ల్ల సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తోందని విమర్శించారు. మహాసభల్లో రాష్ట్రం నుంచి 23మంది ప్రతినిధులుగా పాల్గొంటున్నట్టు ఆయన తెలిపారు.