Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9,168 ఖాళీలను నింపేందుకు ఆర్థికశాఖ ఉత్తర్వులు
- టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మరోసారి కొలువుల జాతర కొనసాగనుంది. గ్రూప్-4 పోస్టుల భర్తీకి వీలుగా ప్రభుత్వం అనుమతులనిచ్చింది. మొత్తం 9,168 ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల భర్తీ ప్రక్రియను టీఎస్పీఎస్సీకి అప్పగించారు. జీవోల్లో పేర్కొన్నదాని ప్రకారం... గ్రూప్-4 ఉద్యోగాలను నాలుగు కేటగిరీలుగా విభజించారు.
429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 18 జూనియర్ ఆడిటర్ పోస్టులు, 1,862 వార్డు ఆఫీసర్ పోస్టులు వాటిలో ఉన్నాయి. ఆర్థికశాఖలో 191, పురపాలకశాఖలో 238 జూనియర్ అకౌంటెంట్ పోస్టులున్నాయి. ఇక జూనియర్ అసిస్టెంట్ పోస్టులను పరిశీలిస్తే... వ్యవసాయశాఖలో 44, బీసీ సంక్షేమశాఖలో 307, పౌరసరఫరాల శాఖలో 72 ఉన్నాయి. అటవీశాఖలో 23, ఆర్థికశాఖలో 46, వైద్య- ఆరోగ్యశాఖలో 338, ఉన్నత విద్యాశాఖలో 742 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. హోం శాఖలో 133, నీటిపారుదల శాఖలో 51, కార్మికశాఖలో 128, మైనార్టీ సంక్షేమశాఖలో 191 జూనియర్ అసిస్టెంట్ పోస్టులున్నాయి.
పురపాలక శాఖలో 601, పంచాయతీరాజ్ శాఖలో 1,245, రెవెన్యూశాఖలో 2,077, ఎస్సీ అభివద్ధి శాఖలో 474 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సర్కారు పచ్చ జెండా ఊపింది. సెకండరీ విద్యాశాఖలో 97, రవాణాశాఖలో 20, గిరిజన సంక్షేమ శాఖలో 221, మహిళా, శిశు సంక్షేమ శాఖలో 18, యువజన సర్వీసుల శాఖలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా భర్తీకానున్నాయి.
గ్రూప్-4 ఉద్యోగ ఖాళీల వివరాలు..
నాలుగు కేటగిరీల్లో గ్రూప్-4 ఉద్యోగాలు
జూనియర్ అసిస్టెంట్ పోస్టులు - 6,859
వార్డు ఆఫీసర్ పోస్టులు - 1,862
జూనియర్ అకౌంటెంట్ పోస్టులు - 429
జూనియర్ ఆడిటర్ పోస్టులు - 18
మంత్రి హరీశ్ హర్షం...
గ్రూప్-4 ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతించటం పట్ల ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఆయా పోస్టులకు పోటీపడబోయే అభ్యర్థులందరికీ
శుభాకాంక్షలు తెలిపారు.