Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చల్లప్ప కమిషన్ సిఫార్సులపై మంత్రుల భేటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చెల్లప్ప కమిషన్ చేసిన సిపార్సుల ప్రకారం గా వాల్మీకి బోయ కులాలను ఎస్టీ కులాల జాబితాలోకి మార్చాలన్న సిపార్సులపై రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, శాసన సభ్యులు బండ్ల కష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ అబ్రాహాం, న్యాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శితో కలిసి హైదరాబాద్ లో న్యాయ శాఖ మంత్రి కార్యాలయంలో న్యాయ పరమైన అంశాలపై చర్చించారు.
ప్రస్తుతం ఎస్టీ జాబితాలో ఉన్న కులాలకు ఇబ్బందులు లేకుండా బిల్లు శాసన సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందెలా కృషి చేయాలనీ, ఆ తర్వాతనే కేంద్ర ప్రభుత్వ సిపార్సులకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులు న్యాయ శాఖ అధికారులను ఆదేశించారు.