Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరెస్టు చేయరాదంటూ సిట్‌కు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు హైకోర్టు ఊరట లభించింది. ఆయనను తదుపరి విచారణ వరకు అరెస్టు చేయాదని సిట్‌ను ఆదేశించింది. ఈ నెల 26 లేదా 28 తేదీల్లో సిట్ ఎదుట హాజరుకావాలని సంతోష్‌కు 41ఎ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు అత్యవసర లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ సురేంద్ర విచారణ జరిపి సంతోష్‌ను అరెస్టు చేయొద్దంటూ సిట్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సంతోష్ జాతీయ స్థాయి నాయకుడనీ, ముందుగా నిర్ణయించిన మేరకు బిజీగా ఉన్నారనీ, సిట్ ఎదుట హాజరయ్యేందుకు గడువు కూడా కోరారని ఆయన తరఫు సీనియర్ అడ్వకేట్ డి.ప్రకాష్‌రెడ్డి వాదించారు. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో ఎలాంటి సంబంధంలేదనీ, అయినా సిట్ సీఆర్పీసీ 41ఏ నోటీసు జారీ చేసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ నోటీసును రద్దు చేయాలని కోరారు. కేసును అత్యవసరంగా విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని విన్నవించారు. లంచ్ మోషన్ పిటిష్రన్లో హైకోర్టు స్టే ఆదేశాలు వెలువరించింది. సిట్ జారీ చేసిన నోటీసుల అమలును నిలిపివేసింది. సంతోష్‌ను అరెస్టు చేయరాదని సిట్‌కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 5కి వాయిదా వేసింది.