Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆదాయపన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్‌ను బోయినపల్లి పోలీసులు అరెస్టు చేయరాదని మరో కేసులో హైకోర్టు స్టే ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఆదాయపు పన్నుల శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన సమయంలో అనుచితంగా వ్యవహరించారంటూ ఆయన కుమారుడు భద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ సోదాలు జరుగుతుండగా బుధవారం రాత్రి మల్లారెడ్డి తన చిన్న కుమారుడు భద్రారెడ్డితో కలిసి బోయిన్పల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సెర్చ్ ప్రొసీడింగ్స్ డాక్యుమెంట్స్‌పై బలవంతంగా సంతకాలు తీసుకునే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై పోలీసులు ఐటీ అధికారి రత్నాకర్‌పై ఐపీసీ 384 (దోపిడీ) సెక్షన్ కింద కేసు పెట్టారు. దీనిని రద్దు చేయాలని రత్నాకర్ హైకోర్టులో అత్యవసర లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు. పోలీసుల కేసును కొట్టివేయాలని కోరారు. ఈ కేసులో వాదనల తర్వాత హైకోర్టు.. రత్నాకర్‌పై నమోదైన కేసు విచారణను నిలిపివేస్తూ స్టే విధించింది. రత్నాకర్‌ను అరెస్టు చేయవద్దని బోయిన్పల్లి పోలీసులను ఆదేశించింది. అంతే కాకుండా పోలీసుల కేసు దర్యాప్తుపై స్టే విధించింది. తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. ల్యాప్‌టాప్‌ను చోరీ చేసి అందులోని కీలక సమాచారాన్ని తొలగించారని రత్నాకర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ల్యాప్‌టాప్‌ను మంత్రి అనుచరులు పోలీసులకు అప్పగిస్తే దానిని పోలీసుల నుంచి తీసుకునేందుకు ఐటీ అధికారులు ముందుకు రాలేదు.