Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిది గంటలు విచారించిన సిట్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖతో పాటు మరో లాయర్ ప్రతాప్‌గౌడ్ లను ప్రత్యేక దర్యాప్తు బృందం శుక్రవారం సుదీర్ఘంగా విచారించింది. దాదాపు ఎనిమిది గంటల పాటు బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్లో వీరి విచారణ కొనసాగింది. నందకుమార్ భార్యను విచారించిన అధికారులు ఆమె నుంచి తన భర్త ఏయే వ్యాపారాలు చేస్తారు? ఎంత కాలం నుంచి ఆ వ్యాపారాలు చేస్తారు? లాభాలు ఏ విధంగా ఉంటాయి? తదితర కోణాల్లో విచారణ జరిపినట్టు తెలిసింది. ఆమె బ్యాంకు ఖాతాను ఉపయోగించి కూడా నందకుమార్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఇక ప్రతాప్‌గౌడ్‌ను విచారించిన సందర్భంలో రామచంద్ర భారతి, సింహయాజీలతో ఆయన ఎప్పటి నుంచి సంబంధాలు కలిగి ఉన్నారు? పరిచయం ఎప్పుడు ఏర్పడింది? తదితర ప్రశ్నలను సిట్ సంధించినట్టు తెలిసింది. ముఖ్యంగా, నందకుమార్‌తో ప్రతాప్‌గౌడ్ అనేక ప్రాంతాల్లో జరిపిన పర్యటనల గురించి కూడా సిట్ ఆరా తీసినట్టు సమాచారం. చిత్రలేఖ, ప్రతాప్‌గౌడ్‌లను విచారించిన అనంతరం ప్రతాప్‌గౌడ్‌ను శనివారం మరోసారి హాజరు కావాలని ఆదేశించిన సిట్ అధికారులు.. చిత్రలేఖను తిరిగి సోమవారం విచారణకు రావాలని స్పష్టం చేశారు.