Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ రాజ్యసభ సభ్యులు రాంజి.గౌతమ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వ రంగాన్నంతా ప్రయివేటీకరించే పనిలో బీజేపీ బీజీగా ఉన్నదని బీఎస్పీ రాజ్యసభ సభ్యులు రాంజీ గౌతమ్ తెలిపారు.శుక్రవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.మోడీ ఎనిమిదేండ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆదివాసులు, దళితులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోపక్క రాజ్యాంగాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని చెప్పారు.ఈ క్రమంలో భవిష్యత్‌లో రాష్ట్రంలో విప్లవం రాబోతున్నదని గుర్తుచేశారు. బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం బలంగా పనిచేస్తున్నదని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో బహుజన రాజ్యం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నుంచి బహుజన రాజ్యాధికార యాత్ర ప్రారంభం కానుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఛీఫ్ కో ఆర్డినేటర్ మంద ప్రభాకర్, పసుపుల బాలస్వామి, చంద్రశేఖర్ ముదిరాజ్, అనితరెడ్డి, సదురుల మల్లేశం, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.