Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
- వచ్చే మూడ్రోజుల్లో పలు జిల్లాల్లో 10 డిగ్రీల లోపే !
- సిర్పూర్(యు)లో అత్యల్పంగా 11.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
నవంబర్లోనే చలి వణుకు పుట్టిస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులులే కాదు చలిపులి కూడా తన పంజా విసురుతున్నది. శుక్రవారం కొమ్రంభీమ్ అసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు)లో అత్యల్పంగా 11.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఆదిలాబాద్ జిల్లా భోరజ్‌లో 11.8, బేలలో 11.9, భరమ్పూర్లో 12.5, జైనధ్‌లో 12.6, రామ్‌నగర్(ఏఆర్ఎస్)లో 12.7, పిప్పల్దరిలో 12.8, నేరడిగొండలో 12.9, చాప్రాల్లో 13.0, కొమ్రంభీమ్ అసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో 13.7 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సంస్థ వాతావరణ బులిటెన్‌లో పేర్కొంది. వచ్చే మూడ్రోజుల్లో కొమ్రంభీమ్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 నుంచి 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. తెలంగాణలో ఈశాన్య, తూర్పు దిశల నుంచి చల్లని గాలులు వీస్తున్నాయి.