Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీలకు డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
క్షేత్రస్థాయిలోని అటవీ ఉద్యోగులకు, సిబ్బందికి మద్దతుగా నిలవాలనీ, భరోసా కల్పించాలని పోలీసు శ్రేణులకు డీజీపీ మహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం లాంటి ఘటనలను పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి పోలీసు ఉన్నతాధికారులు, ఎస్పీలతో డీజీపీ మహేందర్రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో పీసీసీఎఫ్, హెచ్ఓఓఎఫ్ ఆర్ఎం డోబ్రియల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ...విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ, భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. తమ పరిధిలోని చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులతో స్వయంగా సమావేశం కావాలని పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలకు ఆదేశాలు జారీ చేశారు. వారు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యను తెలుసుకుని పరిష్కరించేలా చూడాలని సూచించారు.