Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక వనరులను కట్టడి చేసే దురాలోచన : శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
తెలంగాణ అభివృద్ధిని అడ్డు కునేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం నల్ల గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాల ఆర్థిక వనరులను కట్టడి చేయాలనే దురా లోచనలో కేంద్రం ఉందన్నారు. ఇది ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగించే చర్య అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం బీజేపీ ఎంతకైనా తెగించేలా ఉందని విమర్శించారు. కేంద్రం పరిధిలో ఉన్న అన్ని శాఖలతో ఇబ్బంది పెడుతూ వ్యక్తిగత కక్షకు పాల్పడుతుందన్నారు. తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే అభివృద్ధి చేసి చూపించి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలన్నారు. అలా కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి లబ్ది పొందాలని చూస్తోందని విమర్శించారు. ఐటీ, ఈడీ, సీబీఐని ఉపయోగించి ప్రతిపక్ష పార్టీల నాయకులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధాంత పరంగా కేంద్ర పరి పాలన జరగడం లేదన్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభు త్వాలు ప్రజల మన్నన పొందా లని సూచించారు. జీఎస్టీలో రాష్ట్రానికి రావాల్సిన వాటా ఇవ్వడం లేదని చెప్పారు. రాష్ట్ర విభజన సమ యంలో కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చలేద న్నారు. తన తన యుడు అమిత్ రెడ్డికి రాజ కీయాలంటే ఆసక్తి ఉందని, రాజ కీయాల్లోకి వస్తే తాను వద్దన బోనని చెప్పారు. ప్రజలతో మమే కమై, ప్రజా సంక్షేమానికి పాటు పడేవారికి ఆదరణ ఉంటుం దన్నారు. అమిత్ కూడా సరైన అవకాశం చూసుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని తెలిపారు.