Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ వినుకొండ తిరుమలి, గచ్చిబౌలి ఎస్వీకే కార్యదర్శి పి.ప్రభాకర్
నవతెలంగాణ-మియాపూర్
విద్యార్థులు చదువుతోపాటు సామాజిక అంశాలు నేర్చుకోవాలని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ వినుకొండ తిరుమలి, గచ్చిబౌలి సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి.ప్రభాకర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం గచ్చిబౌలి ఆధ్వర్యంలో బాలల దినోత్సవ ముగింపు కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రయివేటు, కార్పొరేట్ విద్యాలయాలు కేవలం విద్యార్థులను మరబొమ్మలుగానే చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు సమాజంలో నడుచుకోవాల్సిన విధానాలపై ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని నిర్వాహకులకు సూచించారు. భగత్‌సింగ్, గాంధీ, ఇతర స్వతంత్ర సమరయోధుల వేషధారణతో చిన్నారులు ఆకట్టుకున్నారని తెలిపారు. అనంతరం బాల, బాలికలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.