Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనాథ చిన్నారుల కోసం వినియోగం
నవతెలంగాణ- సిటీబ్యూరో
మత సామరస్య ప్రచా రం, విరాళాల సేకరణ వారోత్సవం సందర్భంగా ఫ్లాగ్ డేను పురస్కరించు కొని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల భుయాన్, హైకోర్టు జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డిని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమోరు కుమార్ శుక్రవారం కలిసి విరాళం సేకరించారు. నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ ఆదేశానుసారం నవంబర్ 19 నుంచి 25తేదీ వరకు మత సామరస్య ప్రచారం వారోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రజల్లో మతసామరస్యం పట్ల అవగాహన, ఆవశ్యకత, జాతీయ సమైక్యత, సౌభ్రాతృత్వంపై సాంస్కృతిక కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్‌షాపులు, వక్తృత్వ, చిత్రలేఖనం తదితర అంశాలను ఏర్పాటు చేసి ఫ్లాగ్ డే సందర్భంగా విరాళాలు సేకరిస్తారు. కుల, మత, ఉగ్రవాద ఘర్షణల్లో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ చిన్నారుల పునరావాసం కోసం ఈ విరాళాలను వినియోగిస్తారు.