Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా భూక్య శ్రీనివాస్, వంగూరు రాములు
- గౌరవాధ్యక్షులుగా తుమ్మల వీరారెడ్డి
- 61 మందితో రాష్ట్ర కమిటీ ఎన్నిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా భూక్య శ్రీనివాస్, వంగూరు రాములు, గౌరవాధ్యక్షులుగా తుమ్మల వీరారెడ్డి, కోశాధికారిగా మామిడాల కనకయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 31 మంది ఆఫీస్ బేరర్లు ఉండనున్నారు. 61 మందితో రాష్ట్ర కమిటీ ఉంటుంది. ఆ ఫెడరేషన్ రాష్ట్ర మూడో మహాసభలు గురువారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు వంగూరు రాములు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యక్షులుగా బి.రాములు, యర్రా శ్రీకాంత్, ఎన్.బాలయ్య, బుస్సా మొగిసి, మర్రి ఎల్లయ్య, కత్తుల యాదయ్య, తిరుపతి రాంమూర్తి, పి.చెన్నయ్య, కూరెళ్లి రాములు, చంద్రకాత్, బందుసాయిలు ఎన్నియ్యారు. రెండు కో-ఆప్షన్స్ ఉన్నాయి. రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా పాలడుగు సుధాకర్, యాటల సోమన్న, రాగుల రమేశ్, యు.శ్రీనివాస్, ఎల్లారెడ్డి, శ్రీనివాస్, గోపాలస్వామి, పుట్ట ఆంజనేయులు, వెంకటస్వామి, యాదగిరి, దండేపల్లి సత్తయ్య, ఎం.వీరయ్య, రాపర్తి రాజు ఎన్నికయ్యారు. హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్టు ఏర్పాటు చేయాలనీ, కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని వంగూరు రాములు డిమాండ్ చేశారు. సివిల్ సప్లరు, జిసిసి హమాలీలకు పెరిగిన రేట్లను తక్షణమే అమలు చేయాలని కోరారు.