Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన స్కైరూట్ ఏరో స్పేస్ కంపెనీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో సమీకత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటుచేసేందుకు స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ సంస్థ ఇటీవల ప్రయివేటు రంగంలో అంతరిక్షంలోకి విజయవంతంగా రాకెట్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ సంస్థ శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కే తారకరామారావు పాల్గొన్నారు. సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రంగా తమ కంపెనీ అంతరిక్షంలో మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా రాకెట్‌ను ప్రయోగించి చరిత్ర సష్టించిందనీ, భవిష్యత్‌లోనూ తెలంగాణ కేంద్రంగానే తమ కంపెనీని మరింత విస్త్రుత పరిచేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. దీనికోసం సమీకత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తామనీ, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. దీనికి మంత్రి కేటీఆర్ తక్షణం ఆమోదం తెలిపారు. ఇలాంటి సంస్థ తమ రాష్ట్రంలో ఉండటం గర్వకారణమని చెప్పారు. టీ హబ్ ద్వారానే ఈ విజయం సాధ్యమైందన్నారు. స్పేస్ టెక్ కేపిటల్‌గా హైదరాబాద్ మారుతుందని చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా మరో స్టార్టప్ 'ధృవ' కూడా త్వరలోనే ఉపగ్రహ ప్రయోగం చేయబోతుందని తెలిపారు.