Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ), అడ్మిని స్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి) ఆధ్వర్యంలో పబ్లిక్ పాలసీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేయాలని నిర్ణయించాయి. హెచ్‌సీయూ లోని రాజనీతి శాస్త్ర విభాగం నిర్వహిస్తున్న ''75 ఏండ్లలో పబ్లిక్ పాలసీ-ఒక పునరావలోకనం''అనే అంశంపై రెండురోజుల జాతీయ సదస్సులో భాగంగా శుక్రవారం ముగింపు సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతి ధులుగా హెచ్‌సీయూ వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ బిజె రావ్, ఆస్కి డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ నిర్మాల్య బాగ్చి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాగ్చి మాట్లాడుతూ హెచ్‌సీయూ, ఆస్కి ఆధ్వర్యంలో పబ్లిక్ పాలసీ బలోపేతానికై కృషి చేస్తామని ప్రకటించారు. అంతే కాకుండా ఆ పాలసీపై పీజీ స్థాయిలో ఆన్‌లైన్‌లో కోర్సులు, పాలసీ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సుముఖత ను వ్యక్తం చేసారు. దీనికి బిజె రావు కూడా సానుకూలంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు సామాన్యుల కేంద్రికృతంగా ఉండాలని సూచించారు. ఈ జాతీయ సదస్సు కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ వెంకటేశ్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు ప్రజల జీవితాల్లో సమూల మార్పులు తీసుకొచ్చెలా ఉండాలని చెప్పారు. ఈ సదస్సులో ప్రొఫెసర్లు ప్రకాశ్ సి సారంగి, వీరబాబుతోపాటు రాజనీతిశాస్త్ర విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.