Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25వ వార్షిక దినోత్సవ వేడుకలు
హైదరాబాద్ : ఆర్మీ పబ్లిక్ స్కూల్ (ఏపీఎస్) ఆర్కే పురం 25వ వార్షిక దినోత్సవ వేడుకలు జరిగాయి. ''విహాన్-ఏ న్యూ బిగినింగ్'' పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రిగేడియర్ ఎ.ఎ. దేశపాండే, కమాండెంట్, ఏఓసీ సెంటర్, స్కూల్ చైర్మెన్ అనూజ దేశపాండే లు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డ్యాన్స్, డ్రామా, మ్యూజిక్ వంటివి నిర్వహించారు. విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ పద్మజా రావు ప్రజెంట్ చేశారు. సంస్థకు పేరు తీసుకొచ్చిన విద్యార్థులను బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సత్కరించారు. సిబ్బంది, విద్యార్థుల పట్టుదల, సంకల్పాన్ని ఎ.ఎ దేశ్‌పాండే కొనియాడారు. వారు భవిష్యత్తులో చేపట్టబోయే అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.