Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్‌రావుకు పీఆర్టీయూ తెలంగాణ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను చెల్లించాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్‌రావును శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎం అంజిరెడ్డి నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. సరెండల్ లీవులు, జీపీఎఫ్ తుది చెల్లింపులు, జీవిత బీమా, మెడికల్ రీయింబర్స్‌మెంట్ వంటి బిల్లులు ఆర్థిక శాఖలో ఆమోదం కోసం ఉన్నాయని వివరించారు. ఉపాధ్యాయుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లులను మంజూరు చేయాలని కోరారు. వాటిని వెంటనే మంజూరయ్యేలా చూస్తానంటూ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చా రని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి చంద్ర శేఖర్‌రావు, సంగారెడ్డి అధ్యక్షులు అబ్దుల్లా, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజి రెడ్డి, పత్రికా సంపాదకులు వెంకట్‌రెడ్డి, నాయకులు నర్సిములు పాల్గొన్నారు.