Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లకిë
నవతెలంగాణ- సూర్యాపేట
హింస లేని సమాజ స్థాపన కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లకిë డిమాండ్ చేశారు. నవంబర్ 25న హింస వ్యతిరేక దినోత్సవం నుంచి డిసెంబర్ 10న జరిగే మానవ హక్కుల దినోత్సవం వరకు ఐద్వా ఆధ్వర్యంలో సెమినార్లు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాక్షి శ్రీజూనియర్ కళాశాలలో 'హింస లేని సమాజ స్థాపన' అంశంపై ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు ఏలుగూరి జ్యోతి అధ్యక్షతన నిర్వహించిన సెమినార్‌లో లకిë మాట్లాడారు. సమాజంలో స్త్రీలు పురుషులతో సమానంగా చదువుతూ, అన్ని రంగాల్లో పనిచేస్తూ ముందుకు పోతున్నా ఇంకా వివక్ష కొనసాగడం దుర్మార్గమన్నారు. స్త్రీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా హింస ఎదుర్కొంటు న్నారన్నారు. నూటికి 40 శాతం మంది స్త్రీలు గృహహింస ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి గణాంకాలు తెలుపుతున్నా ప్రభుత్వాలు పట్టించు కోవడం లేదన్నారు. ప్రతి సంవత్సరం హింస వ్యతిరేక దినోత్సవాన్ని స్త్రీల హక్కుల పరిరక్షణ దినంగా పాటించాలన్నారు. మహిళలు, పిల్లలపై దాడులు, హత్యలు, లైంగికదాడులు, హింస పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. కర్నాటక, బీహార్, అస్సాం, తెలంగాణ, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో గృహహింస రోజురోజుకూ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హింస లేని సమాజాన్ని తీసుకురావడం కోసం ప్రభుత్వాలు తమ మేనిఫెస్టోలో సరైన విధానాలను పొందు పరచాలని కోరారు. ప్రభుత్వ విధానాల్లో, పురుషుల ఆలోచనా విధానాల్లో మార్పులు వచ్చినప్పుడు మాత్రమే హింసలేని సమాజాన్ని స్థాపించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. విద్య, క్రీడలు, సైన్స్ రంగాల్లో మహిళలు ముందుకు పోతున్నప్పటికీ ఇంకా ఒదిగి ఉండాలనే పితృస్వామ్య భావజాలాన్ని కొనసాగించడం దుర్మార్గమైన చర్య అన్నారు. మహిళల హక్కులు, చట్టాలను కాపాడుకునేందుకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సెమి నార్‌లో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మేకనబోయిన సైదమ్మ, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.