Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారికి అండగా మహిళా కమిషన్ : వాకిటి సునితా లక్ష్మారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళల హక్కుల కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ, సమన్యాయం అందించే ఉన్నత లక్ష్యాలతో రూపొందించిన రాజ్యాంగం గొప్పదన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో భారతరత్న అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగ పరిరక్షణ సవాలుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదనీ, దేశాన్ని ఒకే తాటిపై నడిపించే స్ఫూర్తితో పనిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాజ్యాంగం ప్రకారం మహిళలకు సమానత్వం, గౌరవం వివక్ష నుండి స్వేచ్ఛ, వారి హక్కులను రక్షించే చట్టాలున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అనేక పథకాలను అమలు చేస్తున్నదన్నారు. మహిళలకు రక్షణగా షీటీమ్స్, భరోసా సెంటర్లు, మహిళా యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు.
వివిధ సమస్యలతో కమిషన్ వద్దకు రాలేని వారికి సోషల్ మీడియా ద్వారా కూడా పిర్యాదు చేయవచ్చని గుర్తుచేసారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ూజఔువశ్రీaఅస్త్రaఅa , ఇమెయిల్ ద్వారా, వాట్సప్ నంబర్ 9490555533 కూడా మహిళలకు జరిగే అన్యాయాన్ని కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ కార్యదర్శి కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.