Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచుల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన భూమిలో వెలసిన ఆక్రమణలను శనివారం అధికారులు కూల్చివేశారు. నిజాంపేటలో సర్వే నెంబర్ 332లో అక్రమంగా కాకతీయ స్టోన్ క్రషర్స్ పేరుతో ఏర్పాటైన షెడ్లు, ఇతర నిర్మాణాలను హెచ్ఎమ్డీఏ, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఈ ఆక్రమణలను తొలగించాలని 2001లోనే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. సొసైటీకి కేటాయించిన మొత్తం 32 ఎకరాల్లోని అక్రమణలను ఆదివారం కూడా కూల్చివేయనున్నట్టు అధికారులు తెలిపారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపుపై ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (మాజీ) ఎన్వీ రమణ కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.